సమాచారం సమీక్ష - A Telugu News Podcast
News:News Commentary
భారతదేశంలో కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్లను ఉపయోగిస్తున్నారు. బహిష్టు సాధారణమైనది మరియు జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, అయినప్పటికీ భారతదేశంలోని బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా periods time లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. మన దేశంలో రుతుక్రమం ని ఎక్కువ మంది 'శాపం', 'అశుద్ధం' మరియు 'మురికి' అని నమ్ముతున్నారు. సెన్సస్ 2011 జనాభా డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 336 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా 2-7 రోజుల పాటు పునరుత్పత్తి వయస్సు మరియు ఋతుస్రావం కలిగి ఉన్నారు, Menstrual hygiene సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, అది ఆమె శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అనేక సమస్యలను కలిగిస్తుంది. విద్య, ఆత్మగౌరవం మరియు విశ్వాసం కూడా దెబ్బతింటుంది. భారతదేశంలో ఋతు పరిశుభ్రత పద్ధతులకు స్థిరమైన ప్రత్యామ్నాయాలను కనుగొనవలసిన అవసరము ఉందని అనేక reports చెబుతున్నాయి. ఎందుకంటే ఇందులో 121 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు సంవత్సరానికి 21,780 మిలియన్ ప్యాడ్లను పారవేస్తారని అంచనా .అది పర్యావరణం కి సమస్యగా మారుతోంది.
ఈ సమస్య మహిళకు గర్భాశయ క్యాన్సర్, సెర్విక్స్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, వివిధ రకాల ఈస్ట్ ఇన్ఫెక్షన్లు మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని వచ్చే అవకాశాలను పెంచుతుంది మొదటిసారిగా రుతుక్రమం వచ్చే వరకు రుతుక్రమం గురించి తెలియదు. శానిటరీ నాప్కిన్ల లభ్యత మరియు రుతుక్రమం గురించి అవగాహనతో సహా రుతు సంబంధ పరిశుభ్రత నిర్వహణ సౌకర్యాలు లేకపోవడం వల్ల భారతదేశంలో దాదాపు 23 మిలియన్ల మంది బాలికలు ఏటా పాఠశాల నుండి తప్పుకుంటున్నారని సమాచారం.
ఈ సమస్య కేవలం ఫెమల్స్ దే కాదు. దాపరికం అవసరం లేదు.ఇంట్లోని మగవారికి కూడా అవగాహన అవసరం. ఫ్యామిలీ, society, government అందరి కి సరైన awareness ఉండి తగిన చర్యలు తీసుకోవాలి.తగిన వసతులు,సపోర్ట్ ఇవ్వాలి. హెల్తీ ఫ్యామిలీ , society కి
హెల్తీ ఉమెన్ అవసం .
ఇవాల్టి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో youngistan ఫౌండర్ అరుణ్ డానియల్ యల్లమంటి గారి interview.
See sunoindia.in/privacy-policy for privacy information.
Create your
podcast in
minutes
It is Free