20 శతాబ్దం ప్రధమార్థంలో తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీప్రముఖుల్లో ఒకరు 'కవికోకిల' దువ్వూరి రామిరెడ్డిగారు. కృషీవలుడు, నలజారమ్మ, వనకుమారి లాంటి పాతికపైగా పద్యకావ్యాలు వ్రాశారు. పానశాల, పండ్లతోట లాంటి అనువాదకావ్యాలు వ్రాశారు. నాటకాలు, సాహిత్యవ్యాసాలు వ్రాశారు. సినిమాలకు రచన చేశారు. ఒక సినిమాకు దర్శకత్వం చేశారు. వందేళ్ళ క్రిందటే కెమేరా, రేడియో సొంతంగా తయారు చేశారు. తను మరణించాక కూడా సైన్సు వ్యాసాలు వ్రాసిన వాళ్ళకు పురస్కారాలు అందచేయడానికి ఓ ట్రస్టు స్థాపించారు.. ఇంత బహుముఖ ప్రఙ్నత్వమున్న రామిరెడ్డిగారు చదువుకున్నది కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే. స్వయంకృషితో ఎన్నెన్నో సాధించవచ్చు అని విశ్వసించి, ఆచరించి, నిరూపించిన సహజకవి, కర్షకకవి శ్రీ దువ్వూరి రామిరెడ్డి. అడుగడుగునా స్ఫూర్తిదాయకమనిపించే కవికోకిల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు ఈ టాక్ షోలోని అంశం.
Create your
podcast in
minutes
It is Free