World’s Greatest Composer | Mozart | ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య సంగీత విద్వాంసుడు | మోజార్ట్
#mozart #westernmusic #famouspeople
Wolfgang Amadeus Mozart (27 January 1756 – 5 December 1791) was a prolific and influential composer of the Classical period. Despite his short life of 35 years, his rapid pace of composition resulted in more than 800 works of virtually every genre of his time. Many of these compositions are acknowledged as pinnacles of the symphonic, concertante, chamber, operatic, and choral repertoire. Mozart is widely regarded as among the greatest composers in the history of Western music . KiranPrabha narrates the interesting life sketch of Mozart in this episode. మోజార్ట్ 18 వ శతాబ్దపు, ప్రపంచ ప్రఖ్యాత పాశ్చాత్య సంగీత విద్వాంసుడు - 35 యేళ్ళ వయసుకే మరణించినా శతాబ్దాలుగా తను సృజించిన 600 పైగా స్వరాలలో చిరంజీవి..! మూడేళ్లవయసుకే పియానో స్వరాల్ని గుర్తుపట్టాడు, నాలుగేళ్ళకే కొత్త స్వరాలు సృజించాడు. మోజార్ట్ కి బాల్యం, యౌవనం, కౌమారం ... అంతా సంగీతమే..! మొజార్ట్ జీవితంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అన్నిరకాల భావోద్వేగాలూ ఉన్నాయి. తండ్రీ కొడుకుల అనుబంధం, అక్కా తమ్ముళ్ళ అనుబంధం, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి చేసిన త్యాగాలు,15 సంవత్సరాలపాటు దేశదేశాల పర్యటనలు, అసూయపడినవాళ్ళు, అనుమానించిన వాళ్ళు, పరీక్షించిన వాళ్ళు, పొమ్మన్నవాళ్ళు, ఎప్పుడూ వెన్నంటిన ఈతి బాధలు, భగ్నప్రేమ, ప్రేయసి చెల్లెల్ని వివాహమాడడం, ఆర్థిక స్థిరత్వంకోసం నిరంతరం అన్వేషణ.. ! ఇన్నింటి మధ్యా అద్భుతమైన స్వరఝరీ సృజన.!! చివరికి మరణించాకనే ప్రపంచమంతా మొజార్ట్ ని గుర్తించడం.!! అడుగడుగునా ఉత్కంఠ కలిగించే జీవనప్రయాణం..మోజార్ట్ది.
Create your
podcast in
minutes
It is Free